సినిమాలకు టాటా చెప్పేస్తా అంటున్న పవర్ స్టార్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సినిమాలకు టాటా చెప్తానని పవర్ స్టార్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు అంతే కాదు ప్రజలకు సేవచేసేందుకు అనంతపురం జిల్లా నుంచే  రానున్న ఎన్నికల్లో పోటీచేస్తాననిమరోసారి స్పష్టం చేసారు  జన సేనలో వక్తలు, కంటెంట్‌ రచయితలు, విశ్లేషకులుగా పనిచేసేం దుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లా నూతన నాయకులతో పవన్‌ ఆదివారం సమావేశమయ్యారు.

ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై పవన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని  తనను కొందరు తాను రాజకీయాల్లో పరిపక్వత లేని వాడిని అని విమర్శిస్తున్నారని, అసలు అలాంటివారు రాజకీయాల్లో ఎవరున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, ఇంట్లోనే ఉండి రూ.కోట్లు సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం నుంచి పోటి చేయడం ఖాయమని స్పష్టంచేశారు. ఇటీవల అనంతపురంలో మూడు రోజులపాటు జరిగిన జనసేన శిబిరంలో పాల్గొన్న వారందరినీ కలవడానికి కొద్దిరోజుల్లో అనంతపురానికి వస్తానని చెప్పారు. త్వరలోనే  అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని పవన్‌ ప్రకటించారు.

]]>