నంది వరించిన ఉత్తమ నటులు ప్రభాస్,నాని

2012, 2013 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఆంధ్ర  ప్రదేశ్  ప్రభుత్వం నంది అవార్డ్స్ ను  ప్రకటించింది. 2012లో ఉత్తమ చిత్రంగా ఈగ, 2013లో ఉత్తమ చిత్రంగా మిర్చి ఎంపికయ్యాయి. 2012 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నానికి చోటు దక్కగా, 2013 సంవత్సరానికి గానూ ప్రభాస్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు

ఉత్తమ చిత్రం- మిర్చి
రెండో ఉత్తమ చిత్రం-నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
కుటుంబకథాచిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ నటుడు- ప్రభాస్‌ (మిర్చి)
బెస్ట్ పాపులర్ చిత్రం: అత్తారింటికి దారేది
ఉత్తమ నటి: అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)
సహాయనటుడు- ప్రకాశ్ రాజ్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
సహాయనటి- నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు అవార్డు- నరేశ్
అల్లు రామలింగయ్య అవార్డు- తాగుబోతు రమేశ్
ఉత్తమ విలన్- సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ దర్శకుడు- కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ రచయిత- మేర్లపాక గాంధీ
ఉత్తమ కథా రచయిత- ఇంద్రగంటి మోహనకృష్ణ
ఉత్తమ మాటల రచయిత- త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీప్రసాద్
ఉత్తమ తొలి దర్శకుడు- కొరటాల శివ
జాతీయ సమగ్రత చిత్రం డాక్యుమెంటరీ ఫిలిం- భారత కీర్తి మూర్తులు
]]>