ప్రదాని మోదీ కి మోదీనే గిఫ్ట్ గా ఇస్తే…

మనకు మననే ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే ఎంతో సంతోషం గా ఉంటాం కదా ఇప్పుడు మన ప్రదాని మంత్రి గారు కూడా అంతే సంతోషం గా ఉన్నారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకున్నారు. భారత పర్యటనకు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్,మోదీ కోసం ఓ ప్రత్యేమై బహుమతిని తీసుకొచ్చారు.మోదీ ఫొటోతో కూడిన మొజాయిక్ ఆర్ట్‌తో పాటు,మోదీ పేరు అరబిక్ భాషలో రాసున్న మరో ఫ్రేమ్‌ను అబ్బాస్ మంగళవారం మోదీకి అందజేశారు.

భారత్‌లో మూడు రోజుల పర్యటనకు గాను పాలస్తీనా అధ్యక్షుడు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరవాత న్యూఢిల్లీలో దిగారు. సోమవారం నొయిడాలోని ఐటీ పార్కును అబ్బాస్ సందర్శించారు. కాగా, సంప్రదాయ ప్రకారం మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో భారత సైన్యం అబ్బాస్‌కి గౌరవ వందనం సమర్పించింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అబ్బాస్‌కు ఘన స్వాగతం పలికారు.

 అనంతరం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో అబ్బాస్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్న అబ్బాస్,మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐదు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేసుకున్నాయి. కాగా, జులైలో మోదీ ఇజ్రాయిల్ పర్యటన ఉండగా.. అంతకంటే ముందు పాలస్తీనా అధ్యక్షుడు భారత్‌కు రావడం ఆసక్తికరంగా మారింది.
]]>