జయను ముందే హెచ్చరించిన మోడీ..!

modi--sasi

modi--sasi ఇదిలా ఉండగా జయ బ్రతికున్న రోజుల్లో ప్రైవేట్ డిటెక్టివ్ లతో పరిశోధన చేయించింది ఈ పరిశోధనలో ఆసక్తి కర అంశాలు వెలుగు చూసాయి అని తెహెల్కా ప్రచురించింది. ఆ కథేంటంటే.. 2011 ఎన్నికల్లో ఈరోడ్‌ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి రామలింగం అనే అభ్యర్థి గెలిచాడు. అతడికి టిక్కెట్టు ఇప్పించింది శశికళే. జయ స్థానంలో శశికళ సీఎం అయ్యేలా చేసేందుకు కేరళలో అతడికి తెలిసిన మాంత్రికులతో మన్నార్‌గుడి మాఫియా క్షుద్రపూజలు చేయించింది. అయితే.. రామలింగం ఆ ముఠాను కూడా మోసం చేశాడని, తానే తమిళనాడు సీఎం అయ్యేలా క్షుద్రపూజలు చేయించాడని డిటెక్టివ్‌ల నిఘాలో తేలింది. ఈ నివేదికలు అందిన వెంటనే జయ ప్రక్షాళనకు దిగారు. తమిళనాడు ఇంటెలిజెన్స్‌ విభాగంలో పాతుకుపోయిన శశికళ అనుచరగణాన్ని బదిలీ చేశారు.చివరకు డిసెంబరు 17, 2011న శశికళతోసహా మన్నార్‌ గుడి మాఫియాను పోయస్‌ గార్డెన్‌ వదిలి వెళ్లాలని అమ్మ ఆదేశించారు. 18న శశికళ, ఆమె భర్తసహా పలువురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే మన్నార్‌ గుడి మాఫియాపై ఏసీబీ దాడులు ప్రారంభమయ్యాయి. పలువురి ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. అయితే, జరిగిన ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని శశికళ.. జయలలితను వేడుకొన్నారు. సుమారు పక్షం రోజులపాటు ఆహారం ముట్టకుండా అమ్మ కరుణ కోసం తపించింది. ఎట్టకేలకు అమ్మ కరుణించింది. దూరం పెట్టిమూడు నెల్లు కాకుండానే తిరిగి శశికళను అక్కున చేర్చుకుంది. మోదీ శశికళ పట్ల విముఖంగా ఉండటానికి ముఖ్య కారణమ్ ఇదే అనేది ప్రధానమైన అంశం .ఇదే అంశాన్ని అన్న డీ ఏం కే పార్టీ వాళ్ళకి ప్రధాని కార్యాలయం స్పష్టం చేసిందట.ఐతే ఈ మాటల్ని చాల ఈజీ గా తీసుకొన్న శశి కల ముఖ్య మంత్రి అయిపోదామని ప్లాన్ వేసింది ఫలితం తెలిసిందే.. ప్రస్తుతం పరిస్థితి ప్రధాని ఆలోచనకు భిన్నంగ ఏమి లేదు అనే చెప్పాలి ఓ వైపు పన్నీరు ధిక్కారం జయ మేనకోడలు సవాళ్లు సుప్రీమ్ ,హై కోర్టుల్లో పిటిషన్లు , ప్రతిపక్ష పార్టీ వ్యతిరేక స్వరం ,అర్హతలు ఇలా శశి కల చుట్టూ వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది ..మొత్తానికి శశి కళ భవితం సుప్రీమ్ నిర్ణయం మీద వుందా లేక మోడీ కరుణ మీద ఉందా అనేది తేలనుంది ..]]>