నిర్మాత దిల్ రాజు భార్య మృతి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత(46) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. అయితే దిల్‌రాజు ఫిదా సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన హుటాహుటిని బయలుదేరారు. ఆయన వచ్చేదాక మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది.పలువురు సినీ ప్రముఖులు దిల్‌రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు.పంపిణీదారుడిగా సినీజీవితం ప్రారంభించిన వీ వెంకట రామణా రెడ్డి, అతికొద్ది కాలంలోనే నిర్మాతగా ఎదిగారు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘దిల్‌’తో అద్భుత విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన తన పేరుని దిల్‌రాజుగా మార్చుకున్నారు. దిల్‌రాజు, అనిత దంపతులు ఇటీవల తమ కుమార్తె హన్హిత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్‌గా జరిపించారు

]]>