కలెక్టర్…చొరవ పెరుగుతున్న నమ్మకం

ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయం మంచిగా చూడరు పట్టించుకోరు అని,ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టిన ప్రజలలో భయం మాత్రం పోవటల్లేదు.ప్రయివేట్ హాస్పిటల్స్ పైనే మక్కువ చూపిస్తున్నారు.యిలాంటి పరిస్థితులలో ప్రజలకు గవెర్నమెంట్ హాస్పిటల్ పై గట్టి నమ్మకం కలింగించడానికి ఒక వినూత్న ప్రయత్నం చేశారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి.

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం నింపేందుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి ముందుడుగు వేశారు.తమ కూతుర్ని(ప్రగతి) వారి స్థాయి కి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లోనే డీలివరీ చేపించొచ్చు కానీ ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.ఎంత క్రిటికల్ కండిషన్ లో కూడా గవెర్నమెంట్ హాస్పిటల్ లో నే ఉంచి డెలివెరి చేయించారు కలెక్టర్ గారు.ప్రగతి కి థైరాయిడ్ ఉంది డెలివరి టైం లో తల్లి బిడ్డ బాగా క్రిటికల్ పోసిషన్ లో ఉన్న కలెక్టర్ గారు మాత్రం తమ నమ్మకాన్ని పోగొట్టు కోకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోని సిజెరియన్  చేయించారు.ప్రగతికి పాప పుట్టింది తల్లి బిడ్డ క్షేమం.

collector

ఈ ఆనంద సమయం లో కలక్టర్ గారు మాట్లాడుతూ ‘కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభిస్తున్నాయి. సర్కారు దవాఖానాలపై విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే నా కుమార్తె ప్రసవానికి గ్రామీణ ప్రాంతమైన ములుగును ఎంచుకున్నా. ’ అని తెలిపారు

]]>