సానియాకి ఇచ్చింది కోటి -మరి సింధుకి యెంత ఇస్తారో కెసిఆర్

టెన్నిస్ క్రీడలో ప్రతిభ చూపినందుకు సానియా మీర్జా జూ కోటి రూపాయలు నజరానా ఇచ్చిన తెలంగాణ ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు ఇప్పుడు బాడ్మింటన్ లో అద్భుత ప్రతిభను  చుపుపించిన సింధు కు యెంత చదివిస్తారో చూడాలి, పీవీ సింధుపై అభినందనల వర్షం కురుస్తోంది. అద్భుతమైన ఆటతీరుతో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న సింధుకు సీఎం కెసిఆర్  అభినందనలు తెలియజేశారు. ఇండియా ఓపెన్ సిరీస్-2017లో మొదటి నుంచి పీవీ సింధూ అసమాన ప్రతిభ కనబరిచిందన్నారు. తనకన్నా మెరుగైన ర్యాంకు కలిగిన క్రీడాకారులను ఓడించి, ఫైనల్ దాకా దూసుకొచ్చి..టైటిల్ సాధించిందని తెలిపారు. ఒలింపిక్స్ నుంచి ఇప్పటి దాకా అనేక చిరస్మరణీయ విజయాలు సాధిస్తున్న పీవీ సింధూ ఇదే ఫామ్ కొనసాగించాలని అంటున్నారు  కేసీఆర్ .

]]>