"రాధ"మే లో వస్తున్నాడట……

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. ఈ సినిమాను మే 12న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
రాధ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తా చాటుతున్న యువ క‌థానాయ‌కుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెండు పాట‌ల‌ను మార్కెట్లోకి విడుద‌ల చేశారు.రెండు పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి.
శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః ర‌ధ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు, ద‌ర్శ‌క‌త్వంః చంద్ర‌మోహ‌న్‌.
]]>