విడుదలకు సిద్ధమవుతోన్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ప్రైమ్‌స్టార్ జగపతిబాబు, సంపత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మే లోనే సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.రేపు టీజర్ రిలీజ్…..ఈ సందర్భంగా నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”నాకు బాగా నచ్చిన రొమాంటిక్ ఫిలింస్ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్, ఎమోషన్స్ సీన్స్ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఎంటర్టైన్మెంట్తో పాటు సెన్సిటివ్ లవ్‌ని ‘మన్మధుడు’లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి కళ్యాణ్ ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్లో కథ రెడీ చేశాడు. అలాగే తెరకెక్కించాడు. ప్రస్తుతం షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. మే 6న దేవిశ్రీ స్వరపరిచిన ఫస్ట్ సింగల్ ని విడుదల చేస్తున్నాము. అలాగే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే లోనే చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సమ్మర్లో వస్తోన్న గుడ్ ఫ్యామిలీ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ ఫిలిం ఇది” అన్నారు.అక్కినేని నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిషోర్, కౌసల్య, ఇర్షాద్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, సప్తగిరి, రఘుబాబు, పృధ్వీరాజ్, చలపతిరావు, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: విశ్వేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల.