రైల్ యాత్రి తన యాప్ అప్డేటెడ్ వెర్షన్ ని రిలీజ్ చేసింది , ఈ యాప్ లో ప్రయాణించే రూట్లలో ఉండే టెలికాం నెట్వర్క్ ఆ నెట్వర్క్ కవరేజీని ముందుగానే చూపిస్తుంది. కొత్తగా వచ్చిన నెట్వర్క్ కవరేజీ ఫీచర్‌తో ప్రయాణికుడు ఫలానా ఏరియాలో నెట్వర్క్ ఉందని ముందుగానే తెలుసుకుంటాడు తద్వారా ఫోన్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ దొరక్క కట్ అయ్యే ఛాన్స్ ఉండదు యాత్రి యాప్ సీఈవో మనీష్ రతీ చెప్పారు.
ప్రయాణ సమయంలో ఏదైనా సినిమా డౌన్లోడ్ చేసుకోవాలంటే సిగ్నల్ తప్పనిసరిగా ఉండాలి …కొత్త ఫీచర్‌తో సిగ్నల్ పూర్తి స్థాయిలో ఎంత దూరం వరకు ఉంటుందనేది తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాను డౌన్లోడ్ చేసుకోనో అవకాశం కలుగుతుంది .
ఢిల్లీ-హౌరా రూట్లో గరిష్టంగా నెట్వర్క్ కవరేజీ 88శాతంగా వుంది ఇందులో అత్యధికంగా 71శాతాన్ని ఎయిర్ టెల్ నెట్వర్క్ అందిస్తోందని చెప్పారు. మరికొన్ని రూట్లలో నెట్వర్క్ కవరేజ్ 20 శాతం ఉన్నట్లు తమ రీసెర్చ్‌లో వెల్లడైందని మనీష్ స్పష్టం చేశారు.
]]>