"బెలూన్‌"…కీల‌క పాత్ర‌లో రాజ్ త‌రుణ్‌

తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం `బెలూన్‌`.జై, అంజ‌లి, జ‌న‌ని అయ్య‌ర్ హీరో హీరోయిన్లుగా యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ ఈ సినిమాలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు.శినిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ‌హేష్ గోవింద‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో పుష్య‌మి ఫిలిం మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బెల్లం రామ‌కృష్ణారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.ఈ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్‌లోఉంది.తెలుగులో ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను త్వ‌రలోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

]]>