రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘బాహుబలి” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, నిర్మాతలు శోభు, ప్రసాద్, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌కుమార్, కళా దర్శకుడు సాబు సిరిల్, స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన, ఇతర యూనిట్ సభ్యులు మాట్లాడారు.
ఈ వేడుకలో బాలివుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ రాజ్ మౌళి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం మేకర్ అంటే సరిపోదు, గ్లోబల్ ఫిల్మ్ మేకర్. స్టీవెన స్పీల్బర్గ్, జేమ్స్ కామెరాన, క్రిస్టఫర్ నోలన. వంటి దర్శకులతో సమానమైన దర్శకుడు అని అరవై సంవత్సరాల క్రితం తీసిన ‘ముఘల్-ఎ-ఆజమ్’ను గుర్తుచేసుకున్నట్లుందని అన్నారు.
వేడుకకు మరొక హైలైట్ కీరవాణి ప్రసంగం ‘ఎవ్వడంట ఎవ్వడంట.. బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవ్వడూ కనందీ, ఎక్కడా వినందీ.. శివుని ఆన అయ్యిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యిందీ’ ‘పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో.. ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగువాడిగా..’అంటూ భాహు బలిలో పాటలు రాసి పాడడం ఏంతో సంతోషం గా ఉందని అన్నారు.రాజమౌళి కి ఆ పాట వినగానే కళ్ళు చమ్మగిల్లాయి.రాజ్ మౌళికి సంపూర్ణ అయుషు తో ఇలాంటి విజయాలు ఇంకా అందుకోవాలని ఆ శివుని కోరుకుంటున్నాను అని తన ఆశిస్సులు కూడా అందించారు కీరవాణి.
‘ప్రతి సినిమాలో ప్రతి హీరోకు ఒక ఎలివేషన ఇచ్చాను కదా.. ప్రభా్‌సకు నేనేమిచ్చాను?’ అని ప్రశ్నించుకుంటే.. సమాధానం ముంబైలో దొరికింది. అక్కడి మీడియా ప్రభాస్‌ను చూసి కేకలు వేస్తున్నారు. అది చూసి గర్వంగా ఫీలయ్యా’’ అన్నారు రాజమౌళి.దర్శకేంద్రుడు రాగవేంద్ర రావు గారు రాజమౌళిని భాహుబలి లో ఒక్క సీన్ డైరెక్ట్ చేయడానికి ఇవ్వమని అడిగారు.ఇలా పలువురి ప్రసంగాలతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.
]]>