యాంకర్ రవి సినిమా ఇదే…

బుల్లి తేరా పాపులర్ యాంకర్ రవి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.యాంకరింగ్ తో నవ్వులు పూయిస్తున్న రవి హీరో ఐతే ఎలా ఉంటాడా ఎం సినిమా అనుకున్న ప్రేక్షకులకోసం ఈ రోజు రవి సినిమా పోస్టర్ ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన ట్విట్టర్ లో విడుదల చేసారు. “ఇది మా ప్రేమ కథ” సినిమా తో రవి హీరోగా పరిచమవుతున్నాడు.మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.చిత్ర నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్.

]]>