డిగ్రీ చదువుతున్న సమయం లో జుకర్ బర్గ్ ఫేస్ బుక్ ని ప్రారంభించాడు.ఫేస్బుక్కు సుమారు 2 బిలియన్ ఖాతాదారులున్నారు.డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే ఫేస్ బుక్ ను స్థాపించిన మార్క్ జుకర్ బర్గ్ అనంతరం తన చదువుని కొనసాగించలేదు.హార్వర్డ్ వర్సిటీ ఆయనకు గౌరవ డిగ్రీ పట్టా అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మే నెలలో జరుగనున్న హార్వర్డ్స్ అప్ కమింగ్ గ్రాడ్యుయేషన్ సెర్మినీలో జుకర్ బర్గ్ పాల్గొని ప్రసంగిస్తారు.ఈ సెర్మినీలో ప్రసంగించనున్న అతిపిన్న వయస్కుడిగా కూడా ఆయన పేరుతెచ్చుకోనున్నారు.అదే రోజు ఆయనకు ఆ పట్టాను అందించనున్నారు.
]]>