మిర్చి ఘాటు తగిలిందెవరికి వారికా వీరికా ?

ఖమ్మం మిర్చి యార్డ్ ఘటనలో తొందర పడ్డారా .పోలీస్ లు పెట్టిన కేసు లు  తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు రైతుల మీదేనా ..ఎందుకంటే మిర్చి యార్డు మీద జరిగిన దాడిలో పాల్గొన్నది రైతులే కాదని మంత్రిగారి వాదన సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య యార్డ్ లోకి వచ్చిన తరవాతే  రైతులు రెచ్చిపోయారు అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి . రైతుల్ని అరెస్ట్  చేసి ఏ 2 గా  ఎమ్మెల్యే  సండ్ర ను చేర్చటం ఆ  తర్వాత  కాంగ్రెస్ నాయకులూ హుటాహుటిన వచ్చి రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి వారు రైతులే అంటూ పట్టా దార్  పాస్ బుక్కులు చూపించారు సండ్ర ఇంకో అడుగు ముందుకేసి వారు సభ్యత్వం ఉన్న తెరాస కార్య కర్తలు ,రైతులే అంటూ పరామర్శించారు కూడా .జిల్లా మొత్తాన్ని టీడీపీ నుంచి తెరాస లోకి వెళ్లిన తర్వాత గులాబీ మయం గా మార్చిన తర్వాత  తుమ్మలకు కెసిఆర్ దగ్గర వెయిట్  అమాంతం  పెరిగిపోయింది కాని మిర్చి యార్డ్ ఘటనతో  కెసిఆర్ దగ్గర కొంత డిఫెన్స్ లో పడ్డారనే గుస గుసలు వినిపిస్తున్నాయి ..మొత్తానికి మిర్చిఘాటు ఎవరికి తగిలింది అనేది ప్రత్యేకం గా చెప్పే అవసరం లేదేమో ..ఇదిలా ఉండగా ..

trs receipt

మిర్చి రైతులను ఆదుకోవటానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య పంట అయిన మిరపకు కనీస ధర నిర్ణయించే విధానం లేకపోవడంతో…వారం రోజులుగా ధర భారీగా పతనమైంది. ప్రారంభంలో క్వింటా రూ.15 వేలు పలికితే.. ఇప్పుడు అదే క్వింటా రూ.3వేలకు పడిపోయింది. దీంతో రైతులు మిర్చిని తగలబెట్టుకునే వరకు వచ్చారు. రైతుల ఆందోళలనపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో.. వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్  మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద మిర్చి కొనుగోలు చేయటానికి నిర్ణయించి  కనీస మద్దతు ధర క్వింటాకి రూ.5వేలుగా నిర్ణయించారు.

అదనపు ఖర్చుల కింద మరో రూ.1500 ఇస్తున్నారు. అంటే రూ.6,500 గిట్టుబాటు అవుతుంది. మే 31వ తేదీ వరకు ఈ కొనుగోళ్లు జరగనున్నాయి. ప్రతి 2వేల ఎకరాలకు ఓ కొనుగోలు పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసే ఈ మిర్చికి నష్టం వస్తే.. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 33వేల 700 మెట్రిక్ టన్నుల మిర్చి పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మిర్చి కోసం ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం హర్షణీయం

]]>