ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెరిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.ఈ సినిమాకి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.
“నయనతార నటనకు పెట్టింది పేరు. సౌతిండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు, తమిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేస్తున్నాం. తమిళ నిర్మాత జబర్గారికి థాంక్స్. తెలుగులో మ్యూజిక్ విషయంలో యశోకృష్ణ ఎంతగానో సపోర్ట్ చేశారు. మయూరి సినిమాలా ఈ సినిమాతో నయనతార మరో సక్సెస్ కొడుతుంది. సురక్ష్ బ్యానర్లో సింగం3 తర్వాత గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది“ అని మల్కాపురం శివకుమార్ అన్నారు.
]]>