రిలయన్స్ జియో లాప్టాప్ లు వచ్చేస్తున్నాయి…

జియో జియో జియో  ఎక్కడ చూసినా జియో నే నిన్నటివరకు టెలికాం రంగం లో సంచలనాలు సృష్టించిన అంబానీ ఇప్పుడు మరో సంచలనానికి తెర  తీయనున్నారు  జియో సెటాప్ బాక్స్ లు, జియో ల్యాప్ టాప్ లను లాంచ్ చేసి మరిన్ని సంచలనాలకు తెరతీసేందుకు సిద్ధం అవుతున్నారు  భారత మార్కెట్లోకి జియో పవర్డ్ ల్యాప్ టాప్ లను అందించేందుకు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ వర్క్ చేస్తుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొత్తగా వచ్చే జియో ల్యాప్ టాప్ 13.3 అంగుళాల స్క్రీన్ సైజును కలిగి ఉంటుందట. ముఖ్యంగా ట్రావెలర్లను ఉద్దేశించి వీటిని తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ లో జియో సిమ్ కార్డును ముందస్తుగానే అమర్చి ప్రవేశపెడుతుందని  దీంతో యూజర్ల కనెక్షన్ ను మరింత పెంచుకోవాలని కంపెనీ  ఎత్తుగడ ..

అంతే కాదు వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్ ను సపోర్ట్ చేయడం తో పాటు లేటెస్ట్ జెనరేషన్ ఇంటెల్ పెంటియమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో ఇది రూపొందుతోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఈఎంఎంసీ లేదా 128జీబీ  ఎస్డీడీ స్టోరేజ్, 12.2ఎంఎం మందం, 1.2 కేజీల బరువు, మ్యాగ్నిసియం అలోయ్ బాడీ దీనిలో మిగతా స్పెషిఫికేషన్లు. దీని ధర కూడా రూ.35వేల నుంచి రూ.45వేల మధ్యలో ఉండేటట్టు ఆవిష్కరించాలని కంపెనీ ప్లాన్ వేస్తోంది. 4జీ సిమ్ కార్డుతో ఈ ల్యాప్ టాప్ తీసుకురావడం గుడ్ ఐడియా అని టెక్ విశ్లేషకులంటున్నారు.
]]>