గుర్తుకొస్తున్నాయి …గుర్తుకొస్తున్నాయి

  • పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే…….
  • స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే…….
  • gd1

    • చాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు……
    • స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే…….
    • మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం.
    • అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం……
    • రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం……

    dg

    • అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం……
    • VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే…….
    • అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే……
    • అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే…..
    • సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం……
    • సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే……
    • మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం………

    gd2

    • స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా మామూలు బట్టలతో వెళ్ళాం………ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
    • స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం. స్నేహితుల మధ్య ” కాకి ఎంగిలి ” చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం……..
    • ఎవరూ ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం……..
    • జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం…….

    gd4

    • సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ, వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే…….
    • శుక్రవారం సాయంత్రం ” చిత్రల హరి” కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే……
    • ఆదివారం ఉదయం 9 కి పనులు తప్పించుకుని “మహాభారతము”” రామాయణం” ” శ్రీకృష్ణ” చూసిన తరమూ మనదే…
    • ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే…
    • అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే …….
    • ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే…
    • పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే……
    • రుపయికు థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం మనదే….
    • గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం.. మనమే.. మనమేఅమ్మ 5 పైసలు ఇస్తే బఠానీలు తిన్నదీ మనమే……
    • గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట..సిర్రగోనే ఆట.. కోతి కొమ్మ… అష్ట చెమ్మ… ఆడిన తరము మనదే….
    • క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే……
    • ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే…..
    • మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్… లేకున్నాఅంతులేని ఆనందాన్ని పొందాం…..
    • మన పిల్లలకు అవి తెలియదు మన పెద్దలకు ఇవి తెలియదు……కానీ మనం అవి ఇవి చూశాం……
    ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు. మీ స్నేహితులందరికి పంపండి…….⁠⁠⁠⁠]]>