"టాన్" పోగొట్టండి ఇలా…

సమ్మర్ వచ్చేసింది హాలి డే ట్రిప్స్ ని ఎంజాయ్ చేసే టైం ఇదే కానీ మన స్కిన్ టాన్ అయ్యే సమయం కూడా ఇదే.సమ్మర్ ని ఎంజాయ్ చేస్తూ స్కిన్ టాన్ పోగొట్టుకువడానికి గృహ చిట్కాలు మీకోసం… **బెకింగ్ సోడాని నీటితో కలిపి పేస్టు తయారు చేసి ఎక్కడైతే సన్ టాన్ ఉందో అక్కడ రాయడం వలన సన్ టాన్ పోతుంది.ఇలా టు డేస్ కి ఒకసారి చేస్తూ ఉండాలి. **తేనె,నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేసి ఎక్కడైతే సన్ టాన్ ఉందో అక్కడ అప్లై చేసి 10-15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. తరువాత కాటన్ టవల్తో తుడవాలి. **పెరుగు, శనగపిండి,నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ఈ మూడిటిని సమాన పరిమాణం లో తీసుకొని. ఈ పేస్టుని సన్ టాన్ ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే దానిని గోరువెచ్చని నీటితో కడగాలి. **పాలల్లో పసుపు,నిమ్మరసం కలిపి టాన్ ఉన్నచోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే చల్లని నీటితో కడగాలి. ఇలా ముఖానికి అప్లై చేయటం కూడా మంచిదే సన్ టాన్ తొలిగి పోతుంది. **సన్ టాన్ ఉన్నచోట కొబ్బరి నీటిని అప్లై చేసి ఆరిన తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది. **నల్ల మచ్చలను తొలగించడానికి 2 స్పూన్స్ టమాటో పేస్టు, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ పెరుగు తీసుకొని పేస్టు తయారు చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 30 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.దీనిలో సిట్రిక్ ఆసిడ్ ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేసి జిడ్డు తనాన్ని పోగొడుతుంది. **బంగాళదుంప పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. మంచి ఫలితం కోసం ఇలా రోజూ చేయాలి. **4-5 బాదం తీసుకొని రాత్రి అంత నీటిలో నానపెట్టాలి. ఉదయాన్నే బాదంలో 2 టేబుల్ స్పూనుల పాలు పోసి పేస్టు తయారు చేయాలి.పేస్టుని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి **బొప్పాయి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి.ఎండిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది మచ్చలను, టాన్ని తొలగించడానికి ఒక మంచి చిట్కా]]>