కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు…

10 రోజుల క్రితం ఖమ్మం మార్కెట్ యార్డ్ ను ధ్వంసం చేసిన మిర్చి రైతుల పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఖమ్మం సబ్ జైలులో ఉన్న వారిని ఈ రోజు కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు.రైతుల చేతులకు పెద్ద పెద్ద సంకెళ్లు ఉండటం.ఎవరూ ఎక్కడికి పారిపోయేవారు కాదు,అయినా సంకెళ్లు వేసి మరీ తీసుకురావటం ఏంటని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.కస్టపడి చెమటోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమనందుకు దొంగల్లా బేడీలు వేస్తారా అంటూ కుటుంబ సభ్యులు మరింత ఆవేదనకు గురి అయ్యారు.

ఇదిలా ఉండగా టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. గిట్టుబాలు ధర కల్పించాలని కోరిన రైతులపై పోలీసులు రాజద్రోహం కేసులు పెట్టారని ఇప్పుడేమో దొంగల్లా రైతులకు బేడీలు వేసి తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.ఉద్యమ సమయంలో వలస పాలకులు కూడా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడలేదన్న రేవంత్ రెడ్డి,రైతు రోదిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.

]]>