రివ్యూ : ఓ బేబీ
నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా
దర్శకత్వం : బి వి నందిని రెడ్డి
నిర్మాతలు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్.
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్
నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 70 ఏళ్ల బామ్మ.. విచిత్రంగా 20 ఏళ్ల యంగ్ లేడీగా మారే అవకాశం వస్తే, అప్పుడు ఆ ఇరవై ఏళ్ల యువతి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశాల్ని ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు.
కథ: బేబీ(లక్ష్మి) ఎప్పుడూ ఏదో కోల్పియినట్లు అసహనంగా ఉండే ఓ బామ్మ. ఓ క్యాంటీన్ ని నడుపుతూ ఉంటుంది. ఆమె మితిమీరిన డామినేషన్,చాదస్తాన్ని తట్టుకోలేక పోతుంటుంది ఆమె మనవరాలు. మనస్పర్ధల కారణంగా బేబీ ఇంటి నుండి బైటికివచేస్తుంది. బేబీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. వృద్ధురాలైన బేబీ యంగ్ లేడీగా మారిపోతుంది. యవ్వనంలోకి ప్రవేశించిన బేబీ(సమంత) ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంది, ఈ ఊహించని ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొంది అనేవి తెరపై చూడాలి.
ప్లస్ పాయింట్స్: కొత్త కథను ఎంచుకోవడంతో పాటు, ఎంచుకున్న కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ నందిని రెడ్డి విజయం సాధించారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆమె కథను చిత్రీకరించిన తీరు అభినందనీయం. నందిని రెడ్డి దర్శకత్వంలో అత్యుత్తమ సినిమాగా ఓ బేబీ గుర్తుండిపోతుంది.
ఇక సమంత తన నటనతో ప్రేక్షకుడిని కథతో ప్రయాణించేలా చేస్తుంది. ఆమె కెరీర్ లో ‘ఓ బేబీ’ బెస్ట్ మూవీలలో ఒకటిగా నిలిచిపోతుంది. రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలో రావ్ రమేష్ తో వచ్చే సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి చేత కంట నీరుపెట్టిస్తాయి. రాజేంద్ర ప్రసాద్. సమంత స్నేహితుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. వృద్ధురాలైన బేబీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మి చక్కగా నటించి పాత్రకు జీవంపోశారు.
ఇక సమంత సరసన హీరో గా చేసిన నాగ శౌర్య హ్యాండ్ సమ్ గా ఉన్నాడు, తన పాత్ర పరిధిలో చక్కగా నటించాడు. హీరోగా మారిన తేజ సజ్జా మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ప్రేమించే యువకుడిగా తన పాత్ర బాగుంది.
మైనస్ పాయింట్స్:
సినిమా రెండవ భాగం కొంచెం సాగతీతకు గురైనట్లు అనిపిస్తుంది.
మొత్తంగా సమంత నటించిన ఓ బేబీ మూవీ ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా. సినిమాలో ఎమోషన్స్,కామెడీ,రొమాన్స్ వాల్యూస్ ఇలా అన్ని కోణాలు కలగలిపి ఒక కంప్లీట్ మూవీ.