అల్లరి రొమాంటిక్ గా వస్తున్నాడు…

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా అల్లరి నరేష్,నిఖిల విమల్‌ హీరో హీరోయిన్ లు గా మలయాళం లో ఘన విజయం సాధించిన ‘ఓరు వడక్కన్‌ సెల్ఫీ’ సినిమా ని తెలుగు లో కి రీమేక్ చేయనున్నారు డైరెక్టర్,ప్రజీత్. జాహ్నవి ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మార్చ్ 16 నుండి మొదలవుతుంది.

ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి తది తరులు నటిస్తున్నారు.ఈ సినిమాకి కేమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ అశోక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌.

]]>