ఆ పనికి బెంగళూరులో గదులు అద్దెకిస్తున్న కోస్త జిల్లా యువకుడు

సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్‌ని అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే  ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వరూప్ అనే యువకుడు  ఇంజనీరింగ్ డిగ్రీ చదివి రెండేళ్లుగా బెంగళూరు లోని అపార్ట్‌మెంట్‌లో వుంటూ అక్కడ మేనేజర్‌గా డ్యూటీ చేస్తున్నాడు. తనకి వచ్చే రూ.15,000 జీతం ఇంటి ఖర్చులకి సరిపోకపోవడంతో అపార్ట్‌మెంట్‌లో గదులని ఇలా వ్యభిచారం కోసం  కస్టమర్స్‌కి అద్దెకి ఇస్తూ అడ్డదారిన సంపాదించడం మొదలుపెట్టాడు .తీగ లాగితే డొంక కదిలినట్టు గా అసలు కధ ఇది ..చదవండి

సినిమాల్లో, సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని  తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్టుని బెంగుళూరు పిలిపించుకున్న వ్యక్తి  వ్యభిచార కూపానికి పంపించాడు. కోరమంగళంలోని ఓ గెస్ట్ హౌజ్‌కి తీసుకెళ్లాడు. మధ్య వర్తి అక్కడి నుంచి సాయంత్రం వేళ మరాఠహళ్లి అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు  రైడ్ చేయడంతో అప్పటివరకు గుట్టుగా సాగిన అపార్ట్మెంట్ వ్యభిచారం కాస్త బైటికొచ్చింది ,బాధితురాలిని కాపాడిన బెంగుళూరు పోలీసులు విచారణలో ఈ నిజాలు వెలుగు చూశాయి స్వరూప్ చిట్టా చిరిగింది .

]]>