నీహారిక తో అదేం లేదంటున్న సాయిధరమ్‌ తేజ్‌

ఒక వార్త రాసేటప్పుడు అందులో నిజా నిజాలు తెల్సుకొని రాయాలి ఒకరి మనోభావాలను దెబ్బ తీసే విధంగా రాయకూడదు అంటున్నారు యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్‌.వరుసకు మరదలైన నటుడు నాగబాబు కుమార్తె నిహారికకు,తేజ్ కు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను తేజ్‌ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధితో ఓ ప్రకటన విడుదల చేశారు.నిహారికను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు తనను భాదపెట్టాయని అన్నారు.

చిన్నతనం నుంచే ఒకే కుటుంబలో కలిసిమెలిసి పెరిగామని ఒకరినొకరం అన్నాచెల్లెళ్లుగా భావిస్తామని వివరించారు.ఒక అమ్మాయికి సంబంధించిన సున్నితమైన వార్తలను ఇచ్చే ముందు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఆధారం లేని వార్తలు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.

]]>