మొదటి సినిమాతో నే ఏమాయ చేసింది సమంత .. అక్కినేని నాగ చైతన్య , సమంతలు ఏడు అడుగుల బంధం తో ఒకటయ్యారు. ఇప్పుడు ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతూ అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తున్నారు. మజిలీ సినిమాలో తెర మీ కూడా భార్య భర్తలు గా మంచి కెమిస్ట్రీ ని పండించారు . సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి . చిత్ర ప్రొమోషన్లో భాగంగా సోషల్‌మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి నందినీరెడ్డి, సమంతలు ఇంటర్వ్యూ ఇచ్చారు. గంగవ్వ తనదైన స్టయిల్ లో వీరిద్దరిని ప్రశ్నలు అడిగి ఆకట్టుకుంది. నాగచైతన్యకు ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు? అని సమంతను అడిగింది గంగవ్వ.. చాలా ఇచ్చాను కానీ ఎంత ఇచ్చాను అనే రహస్యం చెవులో చెప్తాను అని చెప్పి తప్పిచుకోంది సమంత .
