ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు…రెజీనా.సందీప్

సందీప్ కిషన్ హీరో గా,రెజీనా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘నగరం’ .అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.న‌గరం సినిమాకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. రెజీనా ,సందీప్‌కిష‌న్ లు మాట్లాడుతూ ….”ప్రేక్షకులు సినిమాను ఎంత‌గానో ఆద‌రిస్తున్నారు. ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఇలాంటి సినిమాను ఆదిరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు తెలిపారు.త‌మిళంలో సినిమా మాసివ్ హిట్ అయ్యింది. తెలుగు హీరోకు త‌మిళంలో ఇంత పెద్ద హిట్ సినిమా రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది.

]]>