సునీల్-శంకర్ ల మూవీ

  ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా “2 కంట్రీస్”కు రీమేక్ గా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల కె.తారకరామారావు చేతుల మీదుగాజరిగింది. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. “మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు వసూలు చేసిన సూపర్ హిట్ చిత్రం “2 కంట్రీస్”. ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సునీల్ హీరో గా నటిస్తున్నారు.మలయాళ సినిమాకి  సంగీతాన్ని అందించిన గోపీసుందరే తెలుగు సినిమాకి కూడా సంగీతం అందించనున్నారు.సీపాన మాటలు అందించనున్నారు .

నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, మాటలు: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి రమణ, నిర్మాణం-చిత్రానువాదం-దర్శకత్వం: ఎన్.శంకర్!
]]>