బాహుబలి పోస్టర్స్ తో చీరలు వచ్చేశాయి…..

వ్యాపారస్తులు ఏదైనా విషయం ట్రేండింగ్ గా ఉంటె దాని ద్వార వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవలా అనే ఆలోచనలు చేస్తారు ముఖ్యం గా బట్టల వ్యాపారాలు,హిట్ అయిన సినిమాలో హీరోయిన్స్ కట్టుకున్న చీరలు అని లేకపోతె హిట్ అయిన సినిమా పేర్లతో బట్టల విక్రయాలు మొదలు పెడతారు,కాని ఏకంగా సినిమా పోస్టర్స్ తోనే చీరలు ప్రింట్ చేయబడితే…..ఆలోచనే వెరైటి గా ఉంది కదా… బాహుబలి సినిమా పోస్టర్ తో  నే చీరలు వచ్చేశాయి.వీటిని కొనేందుకు మహిళలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

అడ్వర్టైజింగ్ సంస్థలకు కూడా బాహుబలి ఫీవర్ సోకింది. చాక్లెట్ ల నుంచి మొదలు ప్రతి ఒక్కరూ బాహుబలిని వాడేసుకుంటున్నారు. తాజాగా సూరత్ కు చెందిన ఓ చీరల సంస్థ బాహుబలి చీరలు తయారు చేసింది.చీర కొంగుపై అనుష్క- ప్రభాస్ కలిసి ఉన్న పోస్టర్ ని ముద్రించింది.వైజాగ్ లోని సీఎంఆర్ కాంప్లెక్స్ లో వీటిని ప్రదర్శించారు. ఈ కొత్త చీరలు స్థానిక మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

]]>