శశి "కళ" తప్పుతోందా !

తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ యావత్ దేశాన్ని ఉత్కంఠ కు గురి చేస్తున్నాయి . పన్నీరే కదా అని పట్టించుకోలేదు అందరూ ఇప్పుడు ఆ పన్నీరు సెల్వమ్ రాజకీయ కేంద్ర బిందువు గా మారాడు..ఓడలు బండ్లు బండ్లు ఓడలు అంటుంటారు దాని సంగతేమో కానీ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్య మంత్రి సెల్వం విషయం లో మాత్రం ఒక్కటి స్పష్టం ఎవరి బలాబలాల్ని తక్కువ అంచనా వేయకూడదు అని ఈపాటికే స్పష్టం గా తెలిసొచ్చి ఉంటుంది మేధావులందరికీ.ఒక్క రాత్రి లో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొన్న అయన చతురత కు సాహో అనక తప్పదు ఎందుకంటె దివంగత ముఖ్యమంత్రి ,పుఱచి తలైవి జయలలిత కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఎదగటం అంటే మాటలు కాదు. గుర్తింపు తెచ్చుకొని ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం కూడా సెల్వానికే చెల్లింది. ఎందుకంటె జయలలిత అక్రమాస్తుల కేసులో జైల్లో గడిపినా ఆమె తిరిగి వచ్చిన వెంటనే పువ్వుల్లో పెట్టి ఆమెకే ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన నీతి ఆయనది.

మహాభారత రామాయణాల్లో విదురుడు , విభీషణుడు వంటి వాళ్ళు అవలంబించిన నీతినే అయన ఫాలో అయ్యారనే భావించాలి, ధర్మ ప్రకారం వర్తించే వాటినే తనవి గా భావించాలని ఫిలాసఫీని సెల్వం వర్కౌట్ చేసినట్టే కనిపిస్తోంది ..కాని ఇప్పుడు పన్నీర్ సెల్వమ్ “అమ్మ” నెచ్చెలి మీద తిరుగుబాటు చేసారు నొప్పింపక తానొవ్వక అనే విధం గా శశికళ అడగ్గానే రాజీనామా చేసారు లోపల ఎలాంటి ఉద్దేశ్యమే అయినా పైకి మాత్రం కనిపించే నిజం ఒక్కటే సెల్వమ్ రాజీనామా చేసారు అని. రాజీనామా చేసి బైటికొచ్చాక జరిగినదేమిటి అర్ధరాత్రి వెళ్లి అమ్మ సమాధి ముందు కూర్చొని నిజం గా చిన్న పిల్లాడు తల్లి దగ్గరకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పినట్టు సెల్వం  అమ్మకి చెప్పేసారు .అమ్మ నువ్వే సీఎం, విజయం నీదే అని చెప్పింది అంటూ అక్కడ నుంచే తిరుగుబావుటా ఎగరేశారు .దీంతో ప్రజల్లో అయన పట్ల మరింత విశ్వాసం ,ప్రేమ పొంగటమే కాదు సెల్వమ్ సత్తా ని తక్కువగా అంచనా వేసిన ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిల్చారు . ఫలితం తమిళ రాజకీయ భవిష్యత్తు మొత్తం గందర గోళం లో పడినట్లయింది .అంతేకాదు తిరుగులేదు అని మెంటల్ గా ఫిక్స్ ఐన శశి కళ కు పక్కలోనే బల్లెం లా పన్నీర్ నుంచే తిరుగుబాటు రావడం తో శశి కళ తేరుకోలేక విలవిల్లాడింది .ఈ సమయాన్ని పన్నీర్ చక్కగా యుక్తిగా వాడుకున్నారు పార్టీ లోని భీష్మ పితామహులందర్నీ తనవైపుకు సమర్ధవంతం గా తిప్పుకో గలిగారు . అంతే నా కంటికి కనపడని వారి దృష్టిలో (నెటిజన్లు ) దృష్టిలో కూడా భేష్ అని పించుకొని ఒపీనియన్ పోల్ లో 95 శాతం మార్కులు కొట్టేసారు .మొత్తానికి చిన్నమ్మ కళ్ళలో నీళ్లు తెప్పించారు పనీర్.. తానొకటి తలస్తే దైవం ఒకటి తలచింది అంటారు ఇదే అనుకుంట , కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అనేలా మోడీ మార్క్ గేమ్ ఆడుతూనే వున్నారు …

]]>