ఫ్రీ..ఫ్రీ ..ఫ్రీ ఎస్ బిఐ "ఉన్నతి" క్రెడిట్ కార్డు

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖాతాలో డబ్బు నిల్వ ఉంచుతున్న వినియోగదారులకు ఉచితంగా క్రెడిట్‌ కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వినియోగదారుడి క్రెడిట్‌ హిస్టరీ ఎలా ఉన్నా ఖాతాలో డబ్బు నిల్వ ఉంచితే క్రెడిట్‌ కార్డు ఇస్తామని చెప్పింది. నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా కార్డును వినియోగించుకోవచ్చని తెలిపింది.

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ అనే పథకం కింద ఉచిత క్రెడిట్‌కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బకాయిలు పడి ఉన్నారని దీంతో కొత్త కార్డుల జారీ కావడం లేదని ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతి భట్టాచార్య చెప్పారు.  ఎస్‌బీఐ తీసుకొస్తున్న ఉన్నతి కొత్త వినియోగదారులను క్రెడిట్‌కార్డులను వినియోగించేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు.
]]>