"రారండోయ్" రొమాన్స్ చూడండి ….

అక్కినేని వారసుడు నాగ‌చైత‌న్య – అందాల ర‌కూల్ ప్రీత్ జంట‌గా న‌టించిన `రారండోయ్ వేడుక చూద్దాం` టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్‌కి ముందు నుంచే ఇది మ‌రో `నిన్నే పెళ్లాడుతా` లాంటి సినిమా అని ప్ర‌చారం చేశారు కాబ‌ట్టి.. నిజంగానే ఆ అప్పియ‌రెన్స్ టీజ‌ర్‌లో క‌నిపించింది. ఇదో చూడ‌చ‌క్క‌ని ఫ్యామిలీ సినిమా. మాంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అని ట్రైల‌ర్‌లో అర్థ‌మైంది. ముఖ్యంగా ప‌ల్లె ప‌ట్టు అమ్మాయిగా ప‌రికిణీ -ఓణీలో ర‌కూల్ చాలా అందంగా క‌నిపిస్తోంది.చైతూకి లైనేస్తూ చాలానే క‌వ్వించింది. మ‌రోవైపు అక్కినేని బుల్లోడు కూడా ద‌స‌రా బుల్లోడిలా సోగ్గా రెడీ అయ్యి ర‌కూల్‌కి లైనేసే తీరు ముచ్చ‌ట‌గొలిపింది.మంచి రుమాన్స్ ఉన్న టీజ‌ర్ బావుంది.సినిమా కూడా ఇలానే ఉంటే పెద్ద హిట్ట‌వుతుంది. మే 19 రిలీజ్ తేదీ ఫిక్స్ చేశారు కాబ‌ట్టి అందాకా వేచి చూడాల్సిందే.

[embed]http://www.youtube.com/watch?v=RjtDuwbj1Ug[/embed]]]>