పడక గదికి పిలిచేవాళ్లే అక్కడ ఎక్కువ ..

రంగుల ప్రపంచం  కోణాలెన్నిఉన్నాయో ఈ మధ్య కాలం లో అడపా దడపా మహిళా నటులు బైటికొచ్చి గుట్టు విప్పుతున్న సంగతులు చూస్తూనే ఉన్నాం , ఈ తరహా లైంగిక వేధింపులు సహజం అని కొట్టి పారేస్తున్న వాళ్ళూవున్నారు, సీరియస్ గా తీసుకొని కారియర్ కె ఫుల్ స్టాప్ పెట్టుకొన్న వాళ్ళు వున్నారు , తాజా టాపిక్ ఏమిటి అంటే  ఆ తరం సీనియర్ నటి కస్తూరి ఏ విషయం మీద ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్ వ్యూ లో  వేధింపులపై ఎలా స్పందిస్తూ గతం తానూ ఆ తరహా వేధింపులకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు .

అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే విషయాన్ని కుండా బద్దలు కొట్టేసారు ,కస్తూరి అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్‌ అయ్యారు. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి నృత్యం నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన నటి కస్తూరి ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అవకాశాల పేరుతో నటీమణులను పడక గదికి రమ్మనే అలవాటు చిత్ర పరిశ్రమలో ఉందని అన్నారు. తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడంతో తనను చిత్రాల నుంచి తొలగించారని చెప్పారు. అదీ ఒక హీరో కారణంగానే జరిగిందన్నారు. ఇప్పుడా హీరో ఓ రాజకీయ నాయకుడని అన్నారు అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్‌ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని  ఆ తరువాత ఆయన రెండు చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు కానీ కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు. నటి కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీస్తాయో చూడాలి మరి. అలాగే ఇలా ఇంకెందరు ఏ లాంటి గుట్లు విప్పుతారో చూడాలి …

]]>