అమరావతి అభివృద్థిలో సింగపూర్‌ భాగస్వామ్యం…

అమరావతి అభివృద్దే లక్ష్యoగా విదేశి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.చంద్రబాబు సింగపూర్ పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ అత్యుత్తమ ఐదు పట్టణాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతామని,అమరావతి అభివృద్థిలో సింగపూర్‌ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్‌ మాదిరిగా అమరావతిని నిర్మిస్తామన్నారు.

ఈ ఎంఓయూలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్‌ (అంకుర సంస్థలు) ప్రాంత అభివృద్ధి, ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్‌ ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్ కు1691 ఎకరాలు కేటాయించనుంది. రాజధాని ప్రాంతంలో 6.84 చదరపు కిలోమీటర్‌ ప్రాంతాన్ని సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది

ఈ సందర్భంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఏడీపీతో కలిసి కృష్ణా తీరంలో 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
]]>