ఆరెస్సెస్ చీఫ్ "మోహన్ భగవత్" రాష్ట్రపతి కానున్నారా !

భారత దేశానికి ప్రధమ పౌరుడిగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బాధ్యతలు స్వీకరించ నున్నారా ? ఈ ప్రశ్న ఇప్పుడు  ఉత్పన్నం అవుతుందో ఎందుకో చూద్దాం ..రాష్ట్రపతి  పదవికి అర్హత ఉన్న ఒకేఒక వ్యక్తి భగవత్ అని శివసేన వాదిస్తోంది, అంతే కాదు రెండవ అధికార కేంద్రం ఆరెస్సెస్ అని అంటోంది శివసేన, ఉద్దవ్ ఠాక్రే ఆధ్వర్యం లో పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నదని అంటూనే రాష్ట్రపతి పదవికి అర్హులను సూచిస్తోంది శివసేన, ఐతే ఈ మాటల్ని భగవత్ కొట్టిపారేస్తూ తన పేరును ప్రతిపాదించడాన్ని కూడా సమర్ధించను అని తేల్చేసారు, ఇదిలా ఉండగా బాబ్రీ కేసు తీర్పు తర్వాత కూడా రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం లేక పోలేదని అందుకు తగ్గట్టే బీజేపీ సీనియర్ నాయకుడు మురళి మనోహర్ జోషి భగవత్ ను గతవారం లో పిలవడం బట్టి చుస్తే  కొత్త లెక్కలు కూడా తెర  మీదకు వస్తాయనే అభిప్రాయాన్ని సేన వ్యక్తం చేసింది , సామ్నా పత్రికలో ఇటీవల ఎడిటోరియల్ లో వచ్చిన కధనం ప్రకారం అద్వానీ ,జోషి లు పార్టీ విస్తరణ కు ఎంతో కృషి చేసారని అంటూనే ,పార్టీ కి ఎలాంటి పని చేయని కొత్త తరం నాయకులు కూడా రాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ పడుతున్నారని ఆ ఆర్టికల్ లో పేర్కొన్నారు ..]]>