విప్రో ప్రధాన కార్యాలయానికి షాక్ తగిలింది….అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే కార్యాలయాన్ని పేల్చేస్తాo అంటూ బెదిరిస్తున్నారు.ఇటీవలే విప్రో తన లోగోను కూడా మార్చిన సంగతి తెలిసిందే.వివరాలలోకి వెళ్తే…..బెంగుళూరులోని విప్రో ప్రధాన కార్యాలయానికి బెదరింపు లేఖ వచ్చింది.రూ.500 కోట్లు తాము చెప్పిన అడ్రస్‌కు పంపాలని లేదంటే ఆఫీసును పేల్చేస్తామని గుర్తు తెలియని ఆగంతకుడు ఆఫీస్‌కు మెయిల్ పంపాడు. ఈ బెదిరింపు లేఖపై స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ టెర్రర్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఎవరైన ఆకతాయిలు ఈ పని చేశారా అన్నా కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
]]>