వారికి విడాకులే మేలు చేస్తాయా ?

విడాకులు ..ఇదేదో వినకూడని పదం లా కనిపించి విన్పించే మాట ఒకానొక కాలంలో ..ఐతే ఈ మధ్య మాత్రం ఈ మాట పెళ్ళైన ఏడాది లోపే వినిపిస్తోంది చాల జంటల నుంచి. అందుకు సెలబ్రిటీలే ఉదాహరణ ..ఇలా  విడాకులు తీసుకొన్న జంటల్లో వాళ్ళు ఉన్నారు  ఒకప్పుడు సామజిక పరిపక్వత లేక చాల వరకు సర్దుకు పోతూ సంసారాన్ని నెట్టుకొచ్చినా ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ చర్చే అవసరంలేదని చెప్పాలి ఎందుకంటె ఆర్ధిక స్వాతంత్య్రం బాగా పెరగటం మనో నిబ్బరం పెరగడం ఆత్మ దైర్యం ,పెరగడం వంటివి కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిన అంశాలు ఇక పిల్లల విషయానికొస్తే వారికీ చేయాల్సిన న్యాయం ఏమిటి అనేది కూడా కోర్టు మెట్లెక్కే ముందే ఒకమాట అనేసుకొని కేవలం లీగల్ డివోర్స్ కోసమే వెళ్తున్నారనేదే నిజం(ఏ పరిస్థితుల్లో తీసుకొంటున్నారనేది వారి మీద ఆధార పది ఉన్న విషయం) ఎవరో ఏదో అనుకొంటారని నరకం భరించలేమని ఆడ,మగ ఇద్దరు సునాయాసం గా తమ  సమస్యను చెప్పుకొని బైటపడుతూ ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేస్తున్నారు.ఎక్కడో ఇంకా పాత చింతకాయ పచ్చడి మనుషులు లేరని చెప్పలేము ఇదిలా ఉండగా మలి వయస్సులో విడాకులు తీసుకోవడం మనదేశంలో చాలా తక్కువ. అదే విదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మలి వయస్సులో విడాకులు తీసుకున్న స్త్రీల ఆరోగ్యం భేషుగ్గా ఉన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

ఆ వయస్సులో విడాకులు తీసుకున్న స్త్రీలు మానసికంగా కుంగిపోతారు కానీ, ఆరోగ్యంగా ఎలా ఉంటారన్న అనుమానానికి కూడా సమాధానం ఇస్తున్నారు. విడాకుల అనంతరం కొంత మానసిక సంఘర్షణకు గురైనా, తమ ఆరోగ్యంమీద స్త్రీలకు మరింత శ్రద్ధ పెరుగుతుందన్న విషయం వీరి అధ్యయనంలో తేలింది. ఈ కారణంగానే మిగతా స్త్రీలతో పోల్చుకుంటే వీరి ఆరోగ్యం భేషుగ్గా ఉండి ఉండొచ్చని అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒంటరిగా ఉండడం, ఎంత ఆహారం తీసుకుంటున్నామన్న విషయం మీద ఓ కన్నేసి ఉంచడం తదితర కారణాల వలన వీరిలో అధికబరువు సమస్య కనిపించకపోగా, మునుపటి కన్నా చురుకుగా పనులు చేయడాన్ని వారు గమనించారు. ఇదంతా విడాకుల వలనే సాధ్యపడిందా? దీనికి మరేదైనా కారణం ఉందా? అనే విషయం మీద వీరు ఇంకా విస్తృతంగా అధ్యయనం నిర్వహించనున్నారట

]]>