ఏడు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచానికి విశిష్ట సేవలందించి,ప్రసిద్ధ గాయకులు బాలమురళీ కృష్ణ, పండిట్ రవిశంకర్, భీమ్ సేన్ జోషి లాంటి నిష్ణాతులతో కలిసి అనేక కచేరీలు చేసిన ప్రఖ్యాత శాస్త్రీయ గాయకురాలు కిషోరి అమోంకర్ కన్నుమూశారు,విశిష్ట ప్రతిభతో సంగీత ప్రియులను ఆకట్టుకున్న గాయక దిగ్గజం కిషోరి గాన సరస్వతి, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.కిషోరి మరణం సంగీత ప్రపంచానికి తీరనిలోటన్నారు బాలీవుడ్ గాయని లతామంగేష్కర్.
కిశోరి 1932 ఏప్రిల్ 10న ముంబైలో జన్మించారు.ఆమె వయస్సు 84ఏళ్లు. జైపూర్ ఘరానా అనే వినూత్నమైన, విలక్షణమైన సంగీత శైలికి ఆమె ఆద్యురాలు.కిశోరి మృతికి పలువురు ప్రముకులు సంతాపం తెలిపారు.ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు.
]]>