`శివ‌లింగ‌` ట్రైలర్ అదిరింది…..

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై..  కాంచ‌న ను మించిన చిత్రం “శివలింగ” రాఘ‌వ‌ లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ నిర్మించిన చిత్రం ఏప్రిల్ 14న  ఈ సినిమా రిలీజ‌వుతోంది. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ సినిమా.క‌న్న‌డ‌ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.డైరెక్ట‌ర్ వాసు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసారు.ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్సు వచ్చింది.నేడు అభిషేక్ ఫిలింస్ అధినేత ర‌మేష్ పిళ్ళై పుట్టిన‌రోజు. దాదాపు రూ.20 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించి తెర‌కెక్కించిన `శివ‌లింగ‌` తెలుగులో ఘ‌న‌విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అంటున్నారు.ఈ సినిమాతోనే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.మరిన్ని విజయాలు సాదించాలని కోరుకుంటూ ప్రేక్షకుల తరుపున ర‌మేష్ పిళ్లైకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.⁠⁠⁠⁠

]]>