సోనియా కి అస్వస్తత…హాస్పిటల్ కి తరలింపు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత ఏడాది వారణాసిలో జరిగిన రోడ్‌షోలో అనారోగ్యానికి గురైనప్పటి నుంచి తరచూ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారు. వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరిన సోనియా,కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె ప్రచారంలో పాల్గొనలేదని తెలిసిందే.ఐతే అదే ఆస్పత్రిలో ఇప్పుడు మళ్ళి ఫుడ్ పాయిజన్ కారణంగా చేరారు.సోనియాగాంధీ కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.ఆమె రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారని,కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని.త్వరలోనే డిశ్చార్జి చేస్తామని తెలిపారు.

 ]]>