ఆవులకు ఆధార్ కార్డు ఇక నుంచి

మీకే నా గుర్తింపు మాకొద్దా అని పెంపుడు జంతువులూ అడిగే రోజులు వచ్చేశాయ్ ,ఇప్పటివరకు uidai కార్డు కేవలం మనుషులకే జారీ చేసేవారు ఆ ఇది నెంబర్ ఆధారం గా వారిని గుర్తించి ప్రభుత్వ పథకాల్లో లబ్ది దారులుగా  చేర్చే వారు, ఇదిలా ఉండగా తాజాగా  పెంపుడు జంతువులైన ఆవులు కు కూడా ఆధార్ తరహా లో టాంపర్  ప్రూఫ్  గుర్తింపు (uid)  కార్డు ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది , ఇది కొద్ది రోజుల్లో అమలు కాబోతోంది కూడా , ప్రస్తుతం వరకు ఉన్న  సమాచారం ప్రకారం జంతువులకు సంబంధించి వాటి వయస్సు, లింగ బేధం, ఎత్తుశరీరం రంగు, పుట్టుమచ్చలు, తోక పొడవు  ఎలాంటి వివరాలి రికార్డు చేస్తారట ,ఈ డేటా కోసం ప్రత్యేకమైన సర్వర్ ను కూడా రెడీ చేసిందట ప్రభుత్వం, అంతే కాదు ఓ వెబ్ సైట్ ను కూడా తయారు చేసి, ఆన్లైన్ లో సమాచారం ఉంచుతుందట , ఐతే ఇదంతా కేవలం ఆవుల అక్రమ రవాణా ను అరికట్టేందుకే ,ఐతే ఇప్పటికే జంతువులు ఇన్సూరెన్స్ విధానం లో ఈ తరహా లోనే జంతువుల్ని టాగ్ చేస్తున్నారు …బీజేపీ  ప్రభుత్వం లో ఆవుల రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల్లో మరో ముందడుగు ఇది .

]]>