జూన్ 2 నుంచి "అమ్మ ఒడి"పథకం మొదలు…..

తెలంగాణా సర్కార్ ప్రవేశపెట్టిన “అమ్మ ఒడి”పథకం జూన్ రెండు నుండి అమలులోకి రానుంది.ఈ పథకం ప్రారంభం ఐతే ప్రసవ అనంతరం మహిళలకు 12 వేలు,అమ్మాయి పుడితే 13 వేలు,ప్రసవ సమయం లో తల్లులకు, శిశువులకు అవసరమైన వస్తువులను ముఖ్యమంత్రి  కేసిఆర్ కిట్ రూపంలో ఇవ్వనున్నారు.ఈ పథకం ప్రారంభం అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవాల సంఖ్య పెరగనుంది.హాస్పిటల్స్ లో   ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరు కాబట్టి ఎకువ మంది స్టాఫ్ ని తీసుకునేందుకు తెలంగాణా సర్కార్ సిద్దమైంది 432 పోస్ట్ లను మాత శిశు సక్షేమo క్రింద రిక్రూట్ చేయనున్నారు.ఈ నియామకాలు పొరుగు సేవ పద్దతి లో నియమించనున్నారు,ఇందులో 180 మంది నర్స్ లు,18 లేడి డాక్టర్స్ ఇంకా తదితర పోస్టులున్నాయి.

]]>