అవుట్ సోర్స్ ద్వారా అమెరికన్ కంపెనీలు భారతీయుల సేవల్ని వాడుకుంటే ఇక నుంచి ఆయా కంపెనీలకి గ్రాంట్లు, అప్పులు ఇవ్వడం కుదరదని ట్రంప్ ప్రభుత్వంస్పష్టంచేసినట్టే కనిపిస్తోంది నిన్నటి వరకు వీసా నిబంధనల మీద పట్టు బిగించిన ట్రంప్ ఇప్పుడు సొంత దేశం లో పౌరులకు మాత్రమే జాబ్స్ రావాలంటే అవుట్ సోర్స్ విధానానికి స్వస్తి చెప్పి సొంత దేశం వారినే వాడుకోవాలని గట్టి ప్రతి ప్రధానితెర మీదకి తెచ్చింది. ఇటు వంటి నిబంధన విధించటం ద్వారా పరోక్షం గా భారతీయుల మీద కట్టి కట్టింది . ఈ మేరకు అమెరికన్ కాంగ్రె్‌సలోని ప్రతినిధుల సభలో శుక్రవారం బిల్లు ప్రవేశపెట్టారు. ‘యూఎస్ కాల్‌సెంటర్, వినియోగదారుల పరిరక్షణ చట్టం’ పేరిట.. ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు జీన్ గ్రీన్, అధికార పక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డేవిడ్ మెకిన్లీ కలిసి ఈ బిల్లును ప్రతిపాదించారు.
ఉద్యోగాలు భారతకు వెళ్లకుండా అడ్డుకోవడం, స్థానికులకే వచ్చేలా చేయడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దాంతో పాటు దేశీయంగా కాల్ సెంటర్లు ఏర్పాటుచేసే కంపెనీలకు రాయితీలివ్వాలని ‘‘అన్ని ఉద్యోగాలను లేదా సేవల పనులన్నిటినీ ఇతర దేశాలకు తరలించే చెడ్డ కంపెనీల జాబితాను తయారుచేయాలి. ఈ లిస్టులో ఉండే కంపెనీలకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లూ అందవు. వారు తీసుకునే రుణాలకు గ్యారెంటీ ఇవ్వదు’’ అని గ్రీన్, మెకిన్లీ తెలిపారు. అంతేకాదు.. ఈ బిల్లు చట్టమైతే విదేశాల్లో ఉండే కాల్ సెంటర్లు తమ చిరునామా గురించి వివరాలను కస్టమర్లకు తెలపాల్సి ఉంటుంది. వారు కోరితే వారి వినతులను అమెరికాలో ఉండే డొమెస్టిక్ సర్వీసు ఏజెంటుకు అవి బదలాయించాల్సి ఉంటుంది. ‘అమెరికన్ ఉద్యోగులకు మంచి సర్వీస్ సెక్టార్ ఉద్యోగాలు రావలసిన అవసరం ఉంది. ‘అంతేకాదు.. ఉద్యోగాలను తరలించే కంపెనీలకు రాయితీలివ్వడం జరగదు. కాల్ సెంటర్లను అమెరికాలోనే ఉంచాలని ఈ బిల్లు చెప్పదు. కానీ ఇక్కడి నుంచి వేరే దేశాలకు తరలిస్తే మాత్రం ప్రభుత్వ గ్రాంట్లు రావని చెబుతుంది,ఐతే ఈ తరహా బిల్లును గతం లో బరాక్ ఒబామా హయాంలో 2013లో కాంగ్రె్‌సలో ప్రవేశపెట్టారు. దీనికి అప్పట్లో ఆమోదం లభించలేదు. అమెరికాలో అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలని, వాటిని విదేశాలకు తరలించే కంపెనీలపై చర్యలు తప్పవని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో గ్రీన్, మెకిన్లీ తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. ఫలితం భారం గానే ఉండేలా వుంది మన వాళ్ళకి .
]]>