కూతురి ఆఖరి మాటను కూడా వినలేదు ఆ కర్కోటకుడు .

కన్నవారి కోసం ప్రాణాలిచ్చే తల్లితండ్రులున్నారు.కానీ ఎంత కఠినంగా కూతురు ప్రాణాలుపోతున్నా  చూస్తూ ఉన్నాడు ఓ కర్కోటకుడు.నాన్న నన్ను బ్రతికించు అంటూ వేడుకుంది,నాకు బ్రతకాలని ఉంది అంటూ ఏడ్చింది.నాకు వైద్యం చేయించు నాన్నా అంటూ మొరపెట్టుకుంది.అయిన కరగలేదు ఆ కర్కశ తండ్రి మనసు.కన్న తండ్రిని బ్రతిమాలింది తన మాట వినలేదు.మృత్యువుతో పోరాడి చనిపోయింది చిన్నారి సాయి శ్రీ.

ఆ పాప తండ్రికి పెట్టిన వాట్సాప్ వీడియో వైరల్ గా మారింది.నాన్నా నీకు దండం పెడదాం అంటే నా చేతులు వాచి పోయాయి.కాళ్ళు వాచిపోయాయి నడవలేక పోతున్నాను నాన్నా.నన్ను మీ అమ్మ అంటావ్ కదా నాన్నా మీ అమ్మ అనుకొనే ట్రీట్మెంట్ చేపించు.నా ఆస్తి కోసమే క్యాన్సర్ తో చచ్చిపోయేలా చేస్తున్నారు కదూ అని ప్రశ్నించింది… నాకు కేన్సర్ వచ్చింది నిజం అంటూ ఏడుస్తూ పెట్టిన విడియో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.తండ్రి ధనవంతుడై ఉండి కూడా… కూతురి ప్రాణాన్ని కాపాడని ఆ తండ్రిని ఏం చేయాలి? కొడుకులను దగ్గర పెట్టుకుని కూతురిని వదిలేసిన ఆ నీచుడికి ఏ శిక్ష వేయాలి?

విజయవాడ దుర్గాపురానికి చెందిన మాధవ శెట్టి శివకుమార్ , సుమశ్రీ భార్యాభర్తలు. శివ కుమార్ ఓ ఎమ్మెల్యే అనుచరుడు కూడా. ఇతనికి రౌడీ షీటర్లు స్నేహితులుగా ఉన్నారు. కాగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. విడిపోయే ముందు ఒక ఫ్లాట్ ను కూతురు సాయిశ్రీ (12) పేరు మీద రాశాడు. తన ఇద్దరు కొడుకులను తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. ఆ ఫ్లాట్ లో తల్లి సుమశ్రీ, కూతురు సాయిశ్రీతో ఉంటోంది. ఆ ఫ్లాట్ సాయిశ్రీ పేరున రాసినప్పటికీ గార్డియన్ గా తన పేరు రాసుకున్నాడు. పాప ఇంకా మైనర్ కాబట్టి దానిని అమ్మాలంటే అతని అనుమతి అవసరం.

కాగా సాయి శ్రీ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. తల్లి తన దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చింది. వైద్యులు కొన్ని లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, పాపని మంచి ట్రీట్ మెంట్ చేయిస్తేనే బతుకుతుందని తేల్చిచెప్పేశారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని చెప్పారు. చేతిలో అంతడబ్బు లేకపోవడంతో భర్తని సాయం కోరింది. ఫ్లాట్ అమ్మి ఆ డబ్బుతో చికిత్స చేయిస్తానని కోరింది. అయినా అతను ముఖం చాటేశాడు. కూతురు సాయిశ్రీ ఎన్నో సార్లు తండ్రికి ఫోన్ చేసిన ఆయన ఫోన్ ఎత్తలేదు. పది రోజుల క్రితం నుంచి పాప ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో సాయిశ్రీ తండ్రికి తన పరిస్థితిని వివరిస్తూ వాట్సాప్ వీడియో పెట్టింది. బతికించు నాన్నా అని వేడుకుంది. తనకు పైచదువులు చదవాలని ఉందని, స్నేహితులతో ఆడుకోవాలని ఉందని కోరింది.చిట్టి గుండె ఇంతలా వేదన పడుతున్నా తండ్రి మనసు కరగలేదు. అంతేకాదు తన స్నేహితుడైన ఎమ్మెల్యే అనుచరులతో భార్యను బెదిరించి ఫ్లాట్ ఖాళీ చేయమని చెప్పించాడు. చివరికి పాప ఆదివారం మధ్యాహ్నం మరణించింది. అనంతరం తల్లి పాప తండ్రికి పెట్టి వీడియోలను మీడియా ముందు పెట్టింది. కన్న కూతురు క్యాన్సర్ తీవ్ర బాధలు పడుతుంటే కనీసం ఒక్కసారి మాట్లాడ లేదు ఆ తండ్రి. ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకీ రాకూడదు.

]]>