బాబ్రీ – రామ మందిరం కేసు ఇప్పట్లో విచారించలేము ..సుప్రీంకోర్టు

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రామమందిర -బాబ్రీ  మసీదు  వివాదానికి  తెరపడింది అనుకున్నతరుణం లో సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలు ఆశల మీద నీళ్లు చల్లినట్టైంది, ఐతే ఈ సమాధానం భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వేసిన ఒక పబ్లిక్ ఇంట్రస్ట్ పిటిషన్ కి సమాధానం గా సుప్రీమ్ కోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి పిటిషన్ ను నిరాకరించింది , అంతరం సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల పట్ల తానూ అసంతృప్తి గా ఉన్నట్టు చెప్పారు(కేసు ని త్వరగా విచారించాలని స్వామి పిటిషన్ వేశారు ) .

ఇదిలా ఉండగా మార్చి 21 న అపెక్స్ కోర్ట్ ఒక  సూచన చేసింది  ప్రకారం ఇరు వర్గాలు సుహృద్భావ వాతావరణం లో చర్చలు జరపాలని ఇందుకు మధ్య వర్తి గా  త్తను వ్యవహరిస్తానని తద్వారా ఈ వివాదానికి తెర దించాలని సూచించింది . ఈ తరుణం లో ఈ  వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి .ఇప్పటికే బోలెడన్ని రాజి మార్గాలను అన్వేషించినా ఫలితం లేదని  ఇక జడ్జి మెంట్ ఇవ్వడమే మార్గమని స్వామి అభిప్రాయం గా వుంది .

]]>