రైతు ఆత్మహత్యలపై వివరణ ఇవ్వాలి…సుప్రీం కోర్ట్

రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు?వారికి పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్యలు ఏమంటున్నాయి?రైతు ఆత్మహత్యలు ఆపడానికి,వారి సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేంటో సమగ్ర వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రైతుల ఆత్మహత్యల అంశం తీవ్రమైన సమస్య అని సుప్రీం కోర్ట్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని డీవై చంద్రచూడ్‌, ఎస్‌కే కౌల్‌లతో ఈ అంశంపై విచారణ జరిపింది.రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న, ప్రతిపాదించిన చర్యలేమిటో 4 వారాల్లోపు వివరించాలని స్పష్టం చేసింది.

ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం, బీమా పరిధిని పెంచడం, రుణ వితరణ, పంట నష్టానికి పరిహారం.. ఇలా రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నరసింహ వాదనలు వినిపించారు.సూప్రీం కోర్ట్ స్పందిస్తూ ‘వ్యవసాయం రాష్ట్రాల జాబితాలోని అంశం. రైతుల ఆత్మహత్యలకు మూలకారణం కనుగొనాలి. దానికి పరిష్కారంపై ఒక సమగ్రమైన విధానం రూపొందించాలి. దీనిపై కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి’’ అని తెలిపింది.

]]>