విజయ్‌ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం…

బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన జూలై 10న కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. వడ్డీ తో కలిపి దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయి కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేయగా, దీనిపై స్పందించిన న్యాయస్థానం మాల్యా కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్‌ డాలర్లను డిపాజిట్‌ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే.

]]>