ఎండ…ధడ

సమ్మర్ వచ్చేసింది. ఇది సూర్యుడి టైం,వరుణుడు కన్ను ఎర్ర చేసాడు,నిప్పులు కురిపిస్తున్నాడు.ఇప్పటికే ఎండలు మండి పోతున్నాయి.ప్రకృతి అల్లాడి పోతోంది.ప్రతి సంవత్సరం మే నెల నుంచి స్టార్ట్ అయ్యే వడ గాలులు. ఏప్రియల్ మొదటి వారం నుంచే వడగాలులు మొదలవుతాయని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,తీవ్ర ఎండలు ఉండే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తాజా సమాచారం.రుతుపవనాలు ఆగ్నేయంగా ఉన్నాయి.అవి దిశ మారితే యండలు భయంకరం గా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.రానున్న మూడు నెలలో ఎప్పటికప్పుడు వాతావారణ సమాచారాన్ని ప్రతి గురువారం వాతావరణ శాఖ తెలపనుంది.తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఎక్కువ జనాభా ఉన్న ప్రాతాలలోనే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది వాతావరణ అధికారులు పేర్కొన్నారు.సాధ్యమైనంత ఎక్కువ ఎండలో తిరగకుండా ఉండటమే కరెక్ట్ అని సూర్య కిరణాలూ డైరెక్ట్ భూమి మీద పడటమే ఇంతగా ఎండలు ఉండటానికి కారణం అని,ఎక్కువగా నీటిని త్రాగడం మంచిదని సలహాలు ఇస్తున్నారు .వాతావరణ కాలుష్యమే ఈ ఎండల బీభత్సానికి కారణం,గత ఎడాది 700 వందలమంది వడగాడ్పుల భారిన పడి చనిపోయారు అంటున్నారు,హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.,ఈ ఎండలను చూస్తుంటే రోహిణి కార్తె లో పగలాల్సిన రోళ్ళు ఇప్పుడే పగుల్తాయంటే ఆశ్చర్య పడాల్సిన పని లేదేమో.

]]>