ఒక్కోసారి అభిమానుల పిచ్చి ఎదుటి వాళ్ళకి తంటాలు తెచ్చి పెడుతుంది ఇలయదళపతి హీరో విజయ్‌కి ఎదురైంది. విజయ్ వీరాభిమాని అయిన ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెడుతోంది తనకు ఏమాత్రం సంబంధం లేని మేటర్ లో ఇరుక్కుపోయాడు ఏం జరిగింది అంటే విజయ్ వీరాభిమాని అయిన ఓ ఆకతాయి..తన అభిమాన హీరో త్రిశూలం పట్టుకుని ఉన్నపోస్టర్ ని డిజైన్ చేసి ఇంటర్నెట్ లో పెట్టాడు
ఇంకేముంది విజయ్‌కి సోషల్ మీడియా లో ఫాలోయింగ్ అసాధారణం అందుకే ఈ పోస్టర్ వేగంగా వైరల్ అయిపోయింది.ఆ వెంటనే ఈ డిజైన్ అభ్యంతరకరంగా ఉందంటూ హిందూ మక్కల్ మున్నవి పార్టీ విజయ్ పై ఫిర్యాదు చేసారు హీరో విజయ్ పాదాలకు ధరించే షూ వేసుకుని శూలాన్ని ధరించడమేంటి? హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్.. అంటూ సదరు పార్టీ ఆరోపిస్తోంది. చవితినాడు చంద్రుణ్ణి చూడకూడదు అంటారు ఇందుకే అనుకుంట ఆపనిందలు మొయ్యడం అంటే
]]>