ఆమ్మ ..తమిళ ప్రజల పురచ్చితలైవి గా పేరుగాంచిన జయలలిత మరణం తర్వాత, మరణానికి ముందు జరిగిన జరుగుతున్నా పరిణామాలు యావత్ దేశానికీ తెలిసినవే నెచ్చెలి శశి కళ “లు” అందరూ చూస్తున్నారు కూడా… పట్టుమని రెండు నెలలు తిరక్క ముందే తమిళనాడు ముఖ్య మంత్రి పీఠం నుంచి “ఆమ్మ” ముద్దు బిడ్డ గా పేరుగాంచిన పన్నీర్ సెల్వాన్ని కిందకు తోసేసింది..

panner
అనే విషయం కూడా ఇప్పుడిప్పుడు అవగతమవుతొంది తమ్బిలకి  ఇదిలా ఉండగా నిన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు జయలలిత మరణం మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు . ఇక ప్రతి పక్షం లోని స్టాలిన్ ఐతే ముందే శశి కళ అర్హతను తేల్చేసారు చెప్పినట్టే ఆమె ముఖ్యమంత్రి పదవికి అడ్డు పుల్ల వేశారు పరోక్షము గా పన్నీర్ సెల్వని సపోర్ట్ చేస్తున్నట్టే అర్ధం అవుతోంది . ఎందుకంటె అయన మాటలు చేతలు అలానే ఉన్నాయి. ఏంటది వాడైనా వెనుక తోడ్పాటు లేకపోతె ఏమి చేయలేరు అనేది సత్యం. ఇప్పుడు పన్నీర్ సెల్వమ్ లాంటి వాళ్ళుకూడా ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చిందంటే అలాంటి సపోర్ట్ ఉండబట్టే అదే స్థాయి లో శశి కళ కూడా అదో రకమైన ముద్రనుమూట గట్టు కోవడం వెరసి వ్యతిరేకత గా మారింది.. ఇదిలా ఉండగా..నిన్న ప్రెస్ మీట్ లో డాక్టర్స్ కూడా జయ మరణం మీద సరైన క్లారిటీ ఇవ్వలేదు …కెమెరా ఫుట్ ఏజ్ లు విడుదల చేయలేదు అని విమర్శలు వచ్చాయి . ఇక కేంద్రంవైఖరి ప్రత్యేకం గా చెప్పే అవసరం లేదు. గవర్నర్ అందుబాటులో లేరనే ఒకే ఒక్క క్లారిటీతో ప్రమాణ స్వీకారాన్ని పక్కన పెట్టేసారు.. తాజాగా పన్నీర్ సెల్వమ్ ఆమ్మ సమాది ముందు రాత్రికూర్చొని తనకు జరిగిన అవమానాన్ని అమ్మకు తన కన్నీరు ద్వారా పూస గుచ్చినట్టు వివరించారు.. అంతే కాదు మీడియా ముందు జరిగిన విషయాల్ని గుట్టు విప్పుతున్నారు … రానున్న రోజుల్లో “ఆమ్మ” మరణం అసలైన నిజాలు తెలుస్తాయేమో వేచి చూడాలి..
]]>