మోడీ..యోగీ వీరిద్దరి మీదే వారి చూపట ..నిఘా వర్గాల హెచ్చరిక

దేశఅత్యున్నతస్థాయినిఘావర్గాలసమాచారంప్రకారం..లండన్‌కు చెందిన కొందరు ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడ్డారట వీరు చిన్న బృందాలుగా విడిపోయి యూపీ.. ఢిల్లీలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని నిఘా వర్గాలు ఈ సమాచారాన్ని ప్రధానికి రక్షణ కల్పించే ప్రత్యేక రక్షణ దళానికి (ఎస్పీజీ), యూపీ సీఎం యోగికి భద్రతను కల్పించే అధికారులకు చేరవేశారు.నిజానికి మోదీ చాలా ఏళ్లుగా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారట

2013లో పట్నాలో ఒక ర్యాలీ నిర్వహించగా.. వరుస బాంబు దాడులు జరిగాయి. ఈ జాబితాలో ఇప్పుడు యోగి కూడా చేరడం గమనార్హం. మరోవైపు ముంబైలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి కూడా మోదీ.. యోగిలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందింది. రాయ్‌గఢ్‌లో కొందరు రహస్యంగా మోదీ.. యోగిలపై దాడులు చేసే విషయమై చర్చించుకున్నట్లు ఉప్పందింది. వారిని పట్టుకునేందుకు మహారాష్ట్రలోని సీనియర్‌ పోలీసు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేతలు దేశంలో ఎక్కడ పర్యటించినా.. అత్యంత పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్ర పోలీసులకు కూడా సమాచారం పంపించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో.. గతవారం కేంద్ర హోం శాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించింది. యూపీ సీఎం యోగికి ఎన్‌ఎ్‌సజీ కమాండో భద్రతను కల్పించాలని నిర్ణయించింది. ఆయనకున్న జడ్‌ ప్లస్‌ భద్రతకు ఇది అదనమని తెలిపింది. ఇలాంటి భద్రత ప్రస్తుతం 16 మంది వీవీఐపీలకు మాత్రమే ఉంది.
]]>